Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఖాకీ' దర్శకుడికి ఓకే చెప్పిన అజిత్

  • కార్తీ హీరోగా వచ్చిన 'ఖాకీ'
  • తెలుగు .. తమిళ భాషల్లో హిట్ 
  • కొత్త కథతో అజిత్ ను ఒప్పించిన వినోద్
తమిళ స్టార్ హీరోగా అజిత్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇటు మాస్ ఆడియన్స్ లోను .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ లోను ఆయనకి మంచి ఫాలోయింగ్ వుంది. అందువలన అన్నివర్గాల ప్రేక్షకులు ఆశించే అంశాలు తన సినిమాలో ఉండేలా ఆయన శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు. ప్రస్తుతం ఆయన 'విశ్వాసం' సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణపరంగా చివరిదశకు చేరుకుంది.

ఆ తరువాత 'ఖాకీ' దర్శకుడితో కలిసి ఆయన సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. తమిళంలో కార్తీ హీరోగా వినోద్ తెరకెక్కించిన మూవీ తెలుగులో 'ఖాకీ' పేరుతో విడుదలైంది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా సక్సెస్ ను సాధించింది. రీసెంట్ గా ఆయన ఒక కథను అజిత్ కి వినిపించాడట. కథ కొత్తగా .. తన అభిమానులు మెచ్చేలా ఉండటంతో అజిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు.       
ajith
vinod

More Telugu News